![]() |
![]() |

యాంకర్ అశ్వినీ శర్మ గురించి అందరికీ తెలుసు. ఈమె ఎన్నో మూవీ ఈవెంట్స్ కి హోస్ట్ చేయడం, సెలెబ్స్ ని ఇంటర్వ్యూ చేయడం మనం చూసాం. కొన్నాళ్లుగా ఈమె షోలకు వాటికి దూరంగా ఉంటుంది. తన యూట్యూబ్ ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమె ప్రతీక్ అనే సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను పెళ్లి చేసుకుని యూఎస్ లో సెటిల్ అయ్యి రీసెంట్ ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అలాంటి అశ్విని శర్మ ఇప్పుడు తన కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయబోతోంది.
దానికి సంబందించిన లేటెస్ట్ అప్ డేట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " అందరికీ హేయ్, మీకు నేను యాంకర్‌గా యాక్టర్ గా తెలుసు..ఐతే ఇప్పుడు నేను మరో కొత్త రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదే - అమ్మ పాత్ర ! నేను ఒక సరికొత్త యూట్యూబ్ ఛానెల్ "మా అమ్మ సూపర్" ని ప్రారంభించబోతున్నాను. ఇక ఈ విషయాన్నీ మీతో షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా ఛానల్ లో తల్లిగా నా జీవితంలో జరిగే అన్ని విషయాలను స్పెషల్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతున్నాను.
మీ విలువైన క్షణాలను మీతో షేర్ చేసుకోవాలని, నా అభిప్రాయాలను పంచుకోవాలని అనుకుంటున్నా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు కూడా మాతో భాగం కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి, దయచేసి నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుని వీడియోస్ ని చూడండి" అని అశ్విని శర్మ కోరారు. ఇక ఈ ఛానెల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తన కూతురు ఆర్నా ప్రతీక్ ని ఎత్తుకుని ఒక ఫోటోని కూడా టాగ్ చేసి ఈ విషయాన్నీ షేర్ చేసుకుంది. ఇక నెటిజన్స్ మాత్రం ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసేసుకున్నాం అని కామెంట్స్ పెట్టారు.
![]() |
![]() |